జగన్ తిరుమల పర్యటన రద్దు

జగన్ తిరుమల పర్యటన రద్దు

జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు.. 2024, సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం తిరుమల చేరుకుని.. 28వ తేదీ ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత వివాదంపై కొన్ని రోజులుగా పొలిటికల్ వార్ నడుస్తుంది.

ఈ క్రమంలోనే.. 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని.. శ్రీవారికి పవిత్రతను తీసుకురావాలని పిలుపునిచ్చారు జగన్. అందులో భాగంగా.. 28వ తేదీన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఫ్లయిట్ టికెట్లు బుక్ అయ్యాయి. 

ALSO READ | జగన్ ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు.. డిక్లరేషన్ అడిగితే ప్రభుత్వ పతనం ఖాయం.. భూమన

తిరుమలకు జగన్ వెళుతున్న సమయంలో.. టీడీపీ, బీజేపీ కొత్త నినాదం తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతే కాకుండా తిరుపతి, తిరుమల వ్యాప్తంగా ఆంక్షలు విధించింది. ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని.. వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చింది. 

ఇలాంటి సిట్యువేషన్ సమయంలో.. మరో గంటలో తిరుమల విమానం ఎక్కాల్సిన జగన్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు పార్టీ ఆఫీస్ వెల్లడించింది.

ALSO READ | తిరుమల వివాదం : జగన్.. ఈ ఫారంపై సంతకం పెట్టి.. శ్రీవారిని దర్శించుకో : బీజేపీ