బ్యాలెట్లే వాడాలె.. ఈవీఎం లపై జగన్ కీలక ట్వీట్

ఈవీఎం లపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ వాడాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నారని చెప్పారు. భారత్ లోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లే వాడాలన్నారు. న్యాయం జరగడమే కాదు...జరిగినట్లు కనిపించాలన్నారు . ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్పూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలన్నారు జగన్. 

ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ.. మాజీ  సీఎం జగన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి 164, వైసీపీ 11 స్థానాల్లో విజయం సాధించాయి.  ఈ క్రమంలో  ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్‌ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాలు తెరపైకి వచ్చింది.  టెస్లా యజమాని ఎలాన్‌ మస్క్‌ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమంటూ కామెంట్స్ చేశారు.