![పేరు మారింది! ..ఇకపై ముద్రగడ పద్మనాభరెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/06/ysrcp-leader-mudragada-padmanabham-changes-his-name_YKGeFgioOR.jpg)
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఇటీవలే దీనిపై గెజిట్ విడుదలైంది.
ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బంపర్ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఏకంగా డిప్యూటీ సీఎం సైతం అయ్యారు. దీంతో ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్‌లు మెుదలయ్యాయి. తాను సవాలులో ముద్రగడ పద్మనాభం పేరుమార్పు కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవలే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.