వైఎస్ జగన్ తో ఎలాంటి విభేదాలేవు.. భవిష్యత్ లో కూడా రాబోవన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. తన రాజ్యసభ సభ్యత్వానికి ఉపరాష్ట్రపతి ఆమోదం తెలిపారని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. జగన్ తో ఫోన్ లో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశా.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని చెప్పారు. పదవులు ఆశించో....కేసుల మాఫీ కోసమే రాజీనామా చేయలేదన్నారు విజయసాయి రెడ్డి.
నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు చెప్పను. హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా అబద్ధాలు చెప్పను. జగన్ తో ఎలాంటి విభేదాలు లేవు.. భవిష్యత్ లో కూడా రావు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామ చేస్తా. 4 దశాబ్ధాలుగా మూడు తరాలతో నాకు వైఎస్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాకి నాడ పోర్ట్ కేసులో నన్ను ఏ2గా చేర్చారు. పిల్లల సాక్షిగా నాకు కాకినాడ పోర్ట్ అంశంతో సంబంధం లేదు. కేవీ రావుతో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు. నిరంతరం పార్టీ కోసమే పనిచేశా.గవర్నర్ కావాలనో ..బీజేపీలో చేరి మళ్లీ ఎంపీ కావాలనో లేదు . అని చెప్పారు విజయసాయిరెడ్డి.
ALSO READ | రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు జనవరి 24న ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తన రాజ్యసభ సభ్యత్వానికి జనవరి 25న రాజీనామా చేశారు. స్పీకర్ జగదీప్ ధన్కడ్ ఆమోదించారు. వ్యవసాయం చేసుకుంటానని.. ఏ పార్టీలో చేరబోనని చెప్పారు విజయసాయిరెడ్డి .