మాచర్లలో టీడీపీ రిగ్గింగ్​ చేస్తుందని పోలీసులకు చెప్పాం.. .వైసీపీ నేత అనిల్​ కుమార్​ యాదవ్

ఎన్నికల కమిషన్‌ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వైవైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  . ఈవీఎంల ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారో చెప్పాలని డిమాండ్​ చేశారు.  ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారని అనిల్​ కుమార్​ ఆరోపించారు.  పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు.  తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు.   చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు.మాచర్లలో టీడీపీ రిగ్గింగ్‌ చేస్తోందని పోలీసులకు చెప్పినా ఎందుకు  స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. పాల్వాయి గేటు ప్రాంతంలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. . టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు?. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని వైసీపీ నేత అనిల్​కుమార్​ యాదవ్​ అన్నారు.

ఎనిమిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది. ఈవీఎం ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారు. పోలింగ్‌ రోజు పోలీసుల వైఖరి ఈసీకి కనపడలేదా?. ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిన చోట్ల రీపోలింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు