వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో పెనుసంచలనంగా మారింది. శనివారం ( జనవరి 25, 2025 ) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ట్వీట్ చేయటం వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పటం వైసీపీ క్యాడర్లో స్తబ్దత క్రియేట్ చేసింది.ఈ క్రమంలో పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి సంచలన ట్వీట్ చేశారు. త్వరలో పులివెందులకు ఉపఎన్నికలు ఖాయమంటూ బీటెక్ రవి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారటం ఖాయమని.. జగన్ డిస్ క్వాలిఫై అవ్వడం ఖాయమని అన్నారు బీటెక్ రవి. పులివెందుల నియోజకవర్గానికి ఉపఎన్నికలు ఖాయమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు బీటెక్ రవి. నెట్టింట వైరల్ గా మారిన బీటెక్ రవి ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రాజకీయాలకు విజయ్ సాయి రెడ్డి రాజీనామ..
— B.Tech Ravi.Ex.MLC (@BTechRaviOff) January 24, 2025
విజయ్ సాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయం.
జగన్ మోహన్ రెడ్డి డిస్
క్వాలిఫై అవడం ఖాయం.
పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయం.
కాగా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి.. టీడీపీతో రాజకీయంగా విభేదించానని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవని అన్నారు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని... ఇకపై తన భవిష్యత్తు వ్యవసాయమని అన్నారు విజయసాయి రెడ్డి. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.
ALSO READ | నేను ఏ పార్టీలో చేరడం లేదు.. వ్యవసాయం చేసుకుంటా..: విజయసాయి రెడ్డి