సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్.. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి...

ఏపీలో ఈసారి ఎన్నికలపై ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ ఎనౌన్స్ చేసిన రోజు నుండి పోలింగ్ తేదీ వరకూ అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగింది. మరో పక్క ఎన్నికలు ముగిసాక పలు చోట్ల ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగటం రాష్ట్రంలో కలకలం రేపింది. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదంటూ వైసీపీ, కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేయటంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

తాజాగా వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చిన ట్వీట్ కార్యకర్తలకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చే విధంగా ఉంది. జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ విశాఖలో ప్రమాణస్వీకారం చేయనున్నారని, సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్ చేసింది వైసీపీ. అఫీషియల్ హ్యాండిల్ నుండి ఈ ట్వీట్ రావటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.