రాజధాని ఫైల్స్(Rajadhani Files) సినిమా విడుదలను ఆపేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YRS Congress Party) ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంపై తీర్పును వాయిదా వేసింది.
ఇక రాజధాని ఫైల్స్ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా రద్దు చేయాలని, సినిమా విడుదల నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరింది పిటిషన్‌లో పేర్కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పిటీషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం గురించి వైసీపీ ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాజధాని ఫైల్స్ సినిమాలో సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి కొడాలి నానిని లను కించ పరిచేలా చిత్రీకరణ చేశారని, ఎన్నికల ముందు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఈ సినిమా విడుదల చేస్తున్నారు తెలిపారు.
ఇక రాజధాని ఫైల్స్ నిర్మాత తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. డిసెంబర్ 18న సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని, స్క్రీనింగ్ కమిటీ కొన్ని అభ్యంతరాలు తెలుపగా వాటిని తొలగించామని, ఆ తర్వాతే వారు సెన్సార్ సర్టిఫికెట్ జారీచేశారని తెలిపారు. ఇక ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరడం సరికాదు.
సినిమాలో ఎవరిని కించ పరిచే విధంగా సన్నివేశాలు లేవు, కేవలం రాజధాని రైతుల బాధను మాత్రమే చూపించడానికి ప్రయత్నించారు అంటూ.. తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. నిర్ణయాన్ని వాయిదా వేసింది. కాగా ఈ రోజు(ఫిబ్రవరి 14) రాజధాని ఫైల్స్ సినిమాపై ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.