విద్యార్థుల జీవితాలను కేసీఆర్ ఆగం చేస్తున్నాడు: షర్మిల

సీఎం కేసీఆర్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చేది కాదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండ విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు చేయడంలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు ప్రజా సంక్షేమం పట్టించుకోడట్లేదని విమర్శించారు. వైఎస్ షర్మిల ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్లికి 218వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆమె ఇప్పటివరకు 3 వేల 4 వంద కిలోమీటర్లు నడిచారు. 

ఇవాళ భూపాలపల్లి మండలం కొంపల్లి దగ్గర వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. కొత్తపల్లి మండలంలో పాదయాత్ర చేపట్టి.. మహిళలు, రైతులు, గౌడన్నల సమస్యలు విన్నారు. కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా ఉంటుందన్నారు. వైయస్ఆర్ సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.