జగిత్యాల: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 195వ రోజుకు చేరుకుంది. ఇవాళ కథలాపూర్ మేడిపల్లి మండలాల్లో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. కథలాపూర్ మండలం ఎకిన్ పూర్ నైట్ క్యాంప్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది.
షర్మిల సిరికొండ మీదుగా కథలాపూర్ మండల కేంద్రానికి చేరుకుంటారు. ఖతలాపూర్ మండల కేంద్రంలో బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభ అనంతరం దంపేట, దూలూర్, బొమ్మెన నుంచి మేడిపల్లి మండల పరిధిలోని మన్నెగూడెం, భీమారం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది.