కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారన్నారని YSRTP అధ్యక్షురాలు YS షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు గూడెం క్రాస్ దగ్గర జరిగిన రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. అంతకుముందు మర్లపాడు క్యాంప్ నుంచి షర్మిల 79 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. కేసీఆర్ ఊసరవెల్లిలా పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు షర్మిల.
మరిన్ని వార్తల కోసం