ఖాళీలు ఉన్నా కావాలనే భర్తీ చేయట్లే

హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్వి అన్నీ తప్పుడు హామీలు అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆరోపించింది. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ఖాళీలు ఉన్నా కావాలనే భర్తీ చేయడం లేదని మండిపడింది. ఎన్నికల కోసం దొర నిరుద్యోగులను ఎరగా వాడుకుంటున్నారని దుయ్యబట్టింది. బిస్వాల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసింది కేవలం 39 వేలు మాత్రమేనని వైఎస్సార్ టీపీ ట్వీట్ చేసింది. ఉగ్యోగాల భర్తీ కోసం టీఎస్పీఎస్సీని ప్రభుత్వం ఇప్పటివరకు సంప్రదించలేదని విమర్శించింది. 

మరిన్ని వార్తల కోసం:

టీఆర్ఎస్ ను గద్దె దించేందుకే బీజేపీలో విలీనం

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి కన్నుమూత

మేడారం జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు