బషీర్ బాగ్, వెలుగు: బక్రీద్ పండుగ సందర్భంగా గో హత్యలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్, గో ప్రేమికులు గో ఆగ్రహ’ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బక్రీద్ సందర్భంగా సిటీకి వేలాది గోవులను అక్రమంగా తరలిస్తున్నా ప్రభుత్వ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ఆ వర్గం నేతల ఆదేశాలను పాటిస్తోందని ఆరోపించారు. సిటీలో అక్రమంగా నిర్బంధించిన గోవులను 48 గంటల్లో విడిపించాలని డిమాండ్ చేశారు. గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.