గోవధ నిషేధ చట్టాలు తెస్తే ఇలాంటి ఘటనలు జరగవు: యుగ తులిసి ఫౌండేషన్ ఛైర్మన్

గోవధ నిషేధ చట్టాలు తెస్తే ఇలాంటి ఘటనలు జరగవు: యుగ తులిసి ఫౌండేషన్ ఛైర్మన్

తిరుమల లడ్డూ అపవిత్రం వెనుక బాధ్యులెవరైనా కఠినంగా శిక్షించాలన్నారు  యుగతులిసి ఫౌండేషన్ ఛైర్మన్  కే శివకుమార్. గోవధ నిషేధ చట్టాలు తెస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావన్నారు.  గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు పరిమాణం, నాణ్యత ఉండటం లేదన్నారు.

ALSO READ : తిరుమల లడ్డూ తిని ఎవరూ చనిపోలేదు కదా : NTK పార్టీ అధినేత సంచలన కామెంట్స్

టీటీడీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారుతోందన్నారు. లడ్డూ వివాదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. లడ్డు తయారీ ప్రాంతాల్లో కల్తీ జరుగుతుందని గతంలో అనిల్ సింగ్ గారికి చెప్పాను..లడ్డు తయారీకి ఒక్క ప్రత్యేక అధికారిని కూడా నియమించలేదని చెప్పారు. టీటీడీలో పూర్తి స్థాయి  పరీక్ష ల్యాబ్  లేకపోవడం అధికార లోపమేనన్నారు.