క్వార్టర్ ఫైనల్లో యూకీ భాంబ్రీ జోడి

 క్వార్టర్ ఫైనల్లో యూకీ భాంబ్రీ జోడి

కాలిఫోర్నియా: ఇండియా టెన్నిస్‌‌ డబుల్స్ స్టార్ ప్లేయర్ యూకీ భాంబ్రీ ఇండియానా వెల్స్‌‌ ఓపెన్‌‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. ఆండ్రీ గొరాన్సన్‌‌ (స్వీడన్‌‌)తో కలిసి బరిలోకి దిగిన యూకీ బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌‌ మ్యాచ్‌‌లో  6-–2, 5–-7, 10–-5తో రెండో సీడ్‌‌  హ్యారీ హెలొవార (ఫిన్లాండ్‌‌)–హెన్రీ - పాటెన్‌‌ (బ్రిటన్‌‌) జోడీకి షాకిచ్చాడు. గురువారం జరిగే క్వార్టర్స్‌‌లో భాంబ్రీ–-గొరాన్సన్‌‌ జోడీ.. జాన్ స్మిత్‌‌ (ఆస్ట్రేలియా)– - ఫెర్నాండో రంబోలి (బ్రెజిల్‌‌)తో పోటీ పడనుంది.