
దుబాయ్: ఇండియా టెన్నిస్ స్టార్ యూకీ భాంబ్రీ తన కెరీర్‌లో తొలి ఏటీపీ 500 టైటిల్ సొంతం చేసుకున్నాడు. దుబాయ్ చాంపియన్‌షిప్ ఏటీపీ 500 టోర్నమెంట్‌లో అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా)తో కలిసి మెన్స్ డబుల్స్ ట్రోఫీ నెగ్గాడు. శనివారం జరిగిన ఫైనల్లో యూకీ–పాపిరిన్ జోడీ 3–6, 7–6 (14/12), 10–8తో వరల్డ్ నంబర్ 2 జంట హారీ హలియోవార (ఫిన్లాండ్)–హెన్రీ పాటెన్ (బ్రిటన్)పై అద్భుత విజయం సాధించింది. ఈ విక్టరీతో యూకీ డబుల్స్ లో కెరీర్ బెస్ట్ 40వ ర్యాంక్‌కు చేరుకుంటాడు.