హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యుమా ఎనర్జీ సేవలు

హైదరాబాద్​, వెలుగు: బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (బీఏఏఎస్​) సంస్థ అయిన యుమా ఎనర్జీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టింది. దేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే   10 లక్షల నెలవారీ బ్యాటరీ మార్పిడులను సాధించినట్టు ప్రకటించింది. 

ప్రస్తుతం తాము 10 కీలక నగరాలకు విస్తరించినట్టు తెలిపింది.  ఆరు మెట్రోలు బెంగళూరు, ముంబై, నవీ ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్​తోపాటు  నాలుగు నాన్ మెట్రోలు ఇండోర్, కొచ్చి, తిరునల్వేలి, పాండిచ్చేరిలలో సేవలు అందిస్తోంది. యుమా ఎనర్జీకి  ప్రస్తుతం 175 స్వాపింగ్ స్టేషన్లు ఉన్నాయి.