West Bengal Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్

West Bengal Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్

టీమిండియా మాజీ క్రికెటర్ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ తరపున ఈ మాజీ క్రికెటర్.. భారీ మెజార్టీతో గెలుపొందారు. బహరంపూర్ నుండి పోటీ చేసిన ఈ మాజీ క్రికెటర్.. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్, ఐదుసార్లు ఎంపీ అధిర్ రంజన్ చౌదరిపై 70,000 ఓట్లకు పైగా గెలిచారు. మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్‌లు కూడా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ముందంజలో ఉంది, కౌంటింగ్ తర్వాత 29 నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. భారత క్రికెట్ జట్టు తరపున యూసఫ్ పఠాన్ 57 వన్డేలు, 22 టీ20 మ్యాచ్ లాడాడు. వన్డేల్లో 810 పరుగులు.. టీ20 ల్లో 236 పరుగులు చేశాడు.