ఘనంగా యూత్​ కాంగ్రెస్​ ఆవిర్భావ వేడుకలు

ములుగు/ కాటారం/ జనగామ అర్బన్/ స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య హాజరై కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. జయశంకర్​భూపాలపల్లి జిల్లా కాటారంలో యూత్​కాంగ్రెస్​ఆధ్వర్యంలో కాంగ్రెస్​జెండా ఆవిష్కరించి, కేక్​కట్​చేసి, పండ్లు పంపిణీ చేశారు. 

జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​రెడ్డి ఆదేశాలతో యూత్​కాంగ్రెస్​అధ్యక్షుడు బనుక శివరాజ్​యాదవ్​ ఆధ్వర్యంలో యూత్​ కాంగ్రెస్​ జెండాను ఎగురవేశారు. అనంతరం జనగామ ఎంసీహెచ్​లో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్యాంప్​ఆఫీస్​లో యూత్​కాంగ్రెస్​జెండాను ఆవిష్కరించారు. అనంతరం కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వెళ్తామన్నారు.