IML T20 final: ఫైనల్లో మాటల యుద్ధం: యువరాజ్ సింగ్‌పై దూసుకొచ్చిన విండీస్ బౌలర్

IML T20 final: ఫైనల్లో మాటల యుద్ధం: యువరాజ్ సింగ్‌పై దూసుకొచ్చిన విండీస్ బౌలర్

రాయ్‌పూర్‌ వేదికగా ఆదివారం (మార్చి 16) జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్లో మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ టినో మైదానంలో మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. భారత జట్టు ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయుడు ఆష్లే నర్స్ బౌలింగ్ లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత 30 గజాల సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న  యువీతో బెస్ట్ వాగ్వాదానికి దిగాడు. 

Also Read : ఐపీఎల్ ఆడితే మా పరిస్థితి ఏంటి

టినో బెస్ట్ ఓవర్ పూర్తి చేసిన తర్వాత గాయం కారణంగా డగౌట్ కు వెళ్తున్నాడు. ఇది గమనించిన యువరాజ్ సింగ్ అంపైర్ బిల్లీ బౌడెన్ కు చెప్పి విండీస్ బౌలర్ ను గ్రౌండ్ లోకి తీసుకొచ్చాడు. అయితే ఈ విషయం బెస్ట్ కు నచ్చకపోవడంతో యువరాజ్ సింగ్ పైకి గొడవకు దిగాడు. యువరాజ్ కూడా అతనికి ఎదురుగా వెళ్లి ధీటుగా మాట్లాడాడు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో వెస్టిండీస్ కెప్టెన్ బ్రియాన్ ఇద్దరి మధ్య జోక్యం చేసుకొని గొడవన ఆపే ప్రయత్నం చేశాడు. రాయడు కూడా ఇద్దరిని కూల్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ వాగ్వాదం తర్వాత యువరాజ్ సింగ్ బెస్ట్‌ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టి తన బ్యాట్ ను విండీస్ పేసర్ కు చూపించాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (మార్చి 16) రాత్రి జరిగిన ఫైనల్లో  ఇండియా 6  వికెట్ల తేడాతో బ్రియాన్ లారా కెప్టెన్సీలోని వెస్టిండీస్ మాస్టర్స్‌‌ను చిత్తుగా ఓడించింది. అభిమానులతో కిక్కిరిన స్టేడియంలో తొలుత విండీస్ 20 ఓవర్లలో 148/7 స్కోరు చేసింది. లెండిల్ సిమ్మన్స్ (41 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 57), డ్వేన్ స్మిత్ (35 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) రాణించారు. ఇండియా బౌలర్లలో వినయ్ కుమార్ మూడు, షాబాజ్ నదీమ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం రాయుడికి తోడు సచిన్ (18 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 25) ఆకట్టుకోవడంతో ఇండియా మాస్టర్స్  17.1 ఓవర్లలోనే 149/4  చేసి ఈజీగా గెలిచింది. రాయుడు ప్లేయర్ ఆఫ్  ద మ్యాచ్‌‌గా నిలిచాడు.