టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్ ప్రపంచ వన్డే క్రికెట్ లో దూసుకుపోతున్నాడు. నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్న గిల్.. మొన్న బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచులో వీరోచిత సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచులో భారత్ ఓడిపోయినా గిల్ ఇన్నింగ్స్ గిల్ కెరీర్ లో మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎంతో పరిణితి చెందిన ఆటతో దాదాపు చివరి వరకు క్రీజ్ లో నిలిచాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో ఒక చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పిచుకున్నాడు.
ALSO READ: ఆసియా కప్ ఫైనల్: స్టార్ ప్లేయర్లు లేకున్నా.. ఫేవరేట్ గా శ్రీలంక!
ఆ పొరపాటు మరోసారి చేయకు
ఈ మ్యాచ్ అనంతరం గిల్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచులో నా పోరాటం సరిపోలేదు. కానీ ఫైనల్ ఆడేందుకు నేను అంతా సిద్ధంగా ఉన్నాను" అని పోస్ట్ చేసాడు. ఇక ఈ పోస్ట్ పై భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ " బంగ్లాపై మ్యాచులో నువ్వొక చెత్త షాట్ కి ఔటయ్యావు. చివరి వరకు క్రీజ్ లో తప్పకుండా మ్యాచ్ గెలిపించేవాడిని. అయినా గొప్ప ఇన్నింగ్స్ ఆడావు. ఆసియా కప్ ఫైనల్లో మాత్రం ఈ పొరపాటు చేయొద్దు" అని సూచించాడు. మరి నేడు జరిగే ఫైనల్లో గిల్ తన తప్పుని సరి చేసుకొని మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడతాడో లేదో చూడాలి.