2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కెరీర్ లో ఏది కలిసి రాలేదు. క్యాన్సర్ తో పోరాడి భారత్ కు వరల్డ్ కప్ అందించినా..ఇక్కడి నుంచే ఈ లెఫ్ట్ హ్యాండర్ కెరీర్ దిగజారుతూ వస్తుంది. ఇక ఐపీఎల్ లో సైతం తనదైన ముద్ర వేసిన ఈ స్టార్ ఆల్ రౌండర్.. మొదట భారత క్రికెట్ లో ఆ తర్వాత ఐపీఎల్ కు దూరమయ్యాడు. అప్పటినుంచి క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న ఈ పంజాబీ బ్యాటర్ తన కెరీర్ లో జరిగిన ఒక కీలక విషయాన్ని వెల్లడించాడు.
గుజరాత్ టైటాన్స్ జట్టులో ట్టుకు మెంటార్‌గా ఉండాలనుకుంటున్నానని..ఇదే విషయాన్నినెహ్రాకు చెబితే తిరస్కరించాడని యువీ ఆవేదన వ్యక్తం చేసాడు. నాకు ఎలాంటి అవకాశాలు లభిస్తాయో నా చేతులో లేదు. ప్రస్తుతం నా ప్రాధాన్యత నా పిల్లలే. వారితో నాకు ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి వారికి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. కుర్రాళ్లకు మెంటరింగ్ చేయాలని భావిస్తున్నాను. అని యువీ PTI తో అన్నారు.
యువరాజ్ ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్లలో ఒకడు. ప్రారంభ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన యువీ కెప్టెన్ గా జట్టును సెమీస్ కు చేర్చాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ లో మొత్తం 132 మ్యాచ్ లాడినా యువరాజ్ 2750 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 83 పరుగులు. అంతర్జాతీయ క్రికెట్ లో 10 వేలకు పైగా పరుగుల చేసిన యువరాజ్..బౌలింగ్ లోనూ 100కు పైగా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
Former India all-rounder Yuvraj Singh has claimed that he was denied a role in the Gujarat Titans team.
— SportsTiger (@The_SportsTiger) January 16, 2024
?: BCCI / IPL#ipl #ipl2024 #yuvrajsingh #sportstiger pic.twitter.com/NDxAC0v9RO