Yuvraj Singh: రోహిత్‌కే నా ఓటు.. ధోనీ, కోహ్లీని పక్కనపెట్టిన యువరాజ్

Yuvraj Singh: రోహిత్‌కే నా ఓటు.. ధోనీ, కోహ్లీని పక్కనపెట్టిన యువరాజ్

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2000 దశాబ్దంలో మిడిల్ ఆర్డర్ కు  వెన్నుముక్కగా నిలిచాడు. తాజాగా ఒక షో లో అతనికి ఒక కష్టమైన ప్రశ్న ఎదురైంది. క్లబ్ ప్రైరీ ఫైర్ ఎపిసోడ్‌లో భాగంగా ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలలో ఒకరిని బెస్ట్ కెప్టెన్ గా ఎంచుకోమని అడిగారు. దీనికి యువరాజ్ సింగ్ ఆశ్చర్యకరమైన సమాధానాన్ని తెలిపాడు. ధోనీ, కోహ్లీ కాకుండా రోహిత్ శర్మను బెస్ట్ కెప్టెన్ గా అభివర్ణించాడు.

యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.."టీ20 క్రికెట్ అయితే నేను రోహిత్ శర్మను బెస్ట్ కెప్టెన్ గా ఎంపిక చేస్తాను. ఎందుకంటే అతను తన అత్యుత్తమ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. ఈ విషయంలో ఖచ్చితంగా రోహిత్ నా మొదటి ఎంపిక". ఇక ధోనీ లేదా కోహ్లిలలో ఒకరిని ఎవరిని బెంచ్ కు పరిమితం చేస్తావు అనే ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. వారిద్దరి బదులు నేను తప్పుకుంటాను అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఈ షో లో మరో ఇద్దరు దిగ్గజాలు గిల్ క్ట్రిస్, మైకేల్ వాన్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని బెస్ట్ కెప్టెన్ గా తమ అభిప్రాయాన్ని తెలిపారు. 

యువరాజ్ సింగ్ 2000 నుండి 2017 వరకు మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 11,178 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు..  71 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యువరాజ్ సభ్యుడిగా ఉన్నప్పుడు భారత్ 2013లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ..  2007 లో టీ20 ప్రపంచ కప్.. 2011 లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. యువరాజ్ సింగ్ చివరిసారిగా భారత్ తరపున 2017 జూన్ లో వెస్టిండీస్‌పై మ్యాచ్ ఆడాడు.  2019లో అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.