Yuzvendra Chahal: చాహల్‌- ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారా..?

Yuzvendra Chahal: చాహల్‌- ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారా..?

భారత స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ అతని భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారనే వార్తలు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. వీరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయం అధికారికంగా తెలియదు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం వైరల్ గా మారుతోంది. చాహల్‌ తన ఖాతా నుంచి ధనశ్రీ వర్మ ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరూ విడిపోతారనే వార్తలకు బలం చేకూరింది. 

చాహల్‌ను ధనశ్రీ ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసినప్పటికీ అతడితో ఉన్న ఫొటోలను మాత్రం డిలీట్ చేయలేదు. వస్తున్న సమాచార ప్రకారం చాహల్, ధనశ్రీ త్వరలో విడిపోతారని.. అయితే కచ్చితమైన కారణాలు తెలియదని సంబంధింత వర్గాలు వెల్లడించాయి. 2020లో చాహల్, ధనశ్రీ వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట.. త్వరలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం చాహల్ భారత జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ మెగా ఆక్షన్ లో చాహల్ ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల రూపాయాల భారీ ధరకు దక్కించుకుంది.    

ALSO READ | IND vs AUS: స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్.. సహనం కోల్పోయిన కోహ్లీ

ప్రస్తుతం చాహల్ కు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్ లో స్థానం దక్కినా అతనికి  ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత సెలక్టర్లు చాహల్ పూర్తిగా పక్కన పెట్టేశారు. భవిష్యత్ లోనూ చాహల్ భారత జట్టులోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. అతని వయసు 34 ఏళ్ళు కావడం దీనికి ప్రధాన కారణం. 34 ఏళ్ల చాహల్ ఇప్పటివరకు భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 217 వికెట్లు పడగొట్టాడు.