టీ20 వరల్డ్ కప్ కు మరో 50 రోజుల సమయం ఉన్నా.. జట్టును ప్రకటించడానికి సమయం ఆసన్నమవుతుంది. జట్లను ప్రకటించాడనికి ఐసీసీ కటాఫ్ తేదీ మే 1 అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో బీసీసీఐ టీ20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ పై ఒక క్లారిటీ రాలేదు. ముఖ్యంగా స్పిన్నర్ల విషయంలో ఎవరిని ఎంపిక చేస్తారో ఆసక్తికరంగా మారింది.
టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ వరల్డ్ కప్ కు సెలక్ట్ కావడం దాదాపుగా ఖాయమైంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ల రూపంలో చోటు దక్కించుకుంటారు. దీంతో స్క్వాడ్ లో చోటు దక్కించుకునేందుకు యుజ్వేంద్ర చాహల్,రవి బిష్ణోయ్ మధ్య మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన 5 మ్యాచ్ ల్లో 10 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన వారి లిస్ట్ లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.
మరోవైపు రవి బిష్ణోయ్ అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. వికెట్లు తీసుకోకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. చాహల్ కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను బిష్ణోయ్ సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో మరోసారి చాహల్ కు నిరాశ తప్పకపోవచ్చని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. తుది జట్టు విషయం పక్కన పెడితే వీరు 15 మంది ప్రాబబుల్స్ లో ఎవరి వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతారో చూడాలి.
క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ఐపీఎల్ హడావుడిలో ఉన్నారు. ఈ మెగా టోర్నీ తర్వాత వారం రోజుల వ్యవధిలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
Yuzvendra Chahal vs Ravi Bishnoi! Who is ahead to be selected in the Indian team for the T20 World Cup 2024? Here is a stats analysis of the two#YuzvendraChahal #RaviBishnoi #IPL2024 #IPL https://t.co/QcE9vfRMP5
— IndiaTVSports (@IndiaTVSports) April 13, 2024