రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం తమ కొత్త మ్యాచ్ డే కిట్, జెర్సీని ఆవిష్కరించారు. ఐపీఎల్ ప్రారంభం కావడానికి మరో మూడు వరాల సమయం మాత్రమే ఉండటంతో ఈ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తమ కొత్త జెర్సీ డిజైన్‌ను వెల్లడించాలని నిర్ణయించుకుంది. యుజ్వేంద్ర చాహల్, జోస్ బట్లర్ మధ్య లీక్ అయిన వాట్సాప్ చాట్‌తో కొత్త రాజస్థాన్ రాయల్స్ జెర్సీ రివీల్ అయ్యింది.
రాజస్థాన్ రాయల్స్ తన X లో రిలీజ్ చేసిన వీడియోలో యుజ్వేంద్ర చాహల్ కొత్త మ్యాచ్ డే కిట్‌ను డిజైన్ చేస్తూ కనిపించాడు. రానున్న సీజన్ కోసం ఆటగాళ్లు ధరించే కొత్త రాజస్థాన్ రాయల్స్ జెర్సీని యుజ్వేంద్ర చాహల్ పొందడంతో వీడియో ముగిసింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 24న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయింట్స్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
తొలి సీజన్ లో అంచానాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏకంగా టైటిల్ గెలిచి అన్ని జట్లకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత 2022 ఐపీఎల్ ఫైనల్ కు చేరినా టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఈ రెండు సీజన్లు మినహాయిస్తే తరువాత కనీస ప్రదర్శన చేయలేకపోయింది. సంజు శాంసన్ కెప్టెన్సీలో ఈ సారైనా టైటిల్ దక్కించుకుంటుందేమో చూడాలి.
Yuzvendra Chahal unveiles Rajasthan Royals' new jersey for the upcoming IPL 2024#IPL2024 pic.twitter.com/ljqRHaWZHr
— CricXtasy (@CricXtasy) March 4, 2024