జగిల్​ లాభం రూ.19 కోట్లు

జగిల్​ లాభం రూ.19 కోట్లు

హైదరాబాద్​, వెలుగు : సాఫ్ట్​వేర్ ​యాజ్​ సర్వీస్​(సాస్​) ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ జగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ మార్చి క్వార్టర్​కు  రూ.19.15 కోట్ల నికరలాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. గత మార్చి క్వార్టర్​లో వచ్చిన లాభంతో పోలిస్తే రెండింతలు పెరిగింది.  కంపెనీ గత ఏడాది కాలంలో రూ.7.56 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 

జగిల్​ నిర్వహణ ఆదాయం 2023 ఆర్థిక సంవత్సరం జనవరి–-మార్చి కాలంలో రూ.186.85 కోట్ల నుంచి ఈసారి రూ.273.37 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయంలో పెరుగుదల అధిక వడ్డీ ఆదాయం వల్ల లాభం వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.   2023–-24 ఆర్థిక పూర్తి సంవత్సరానికి లాభం 92 శాతం పెరిగి రూ.44.02 కోట్లకు చేరుకుంది.  ఆదాయం 40.13 శాతం పెరిగి రూ.775.59 కోట్లకు ఎగిసింది.