ఖానాపూర్ జామా మసీద్ అధ్యక్షుడిగా జహీర్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ లోని జామా మసీద్ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ  తెలంగాణ వక్ఫ్ బోర్డు  సీఈవో  ఎస్. ఖాజా మొయినుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు.  మసీద్​ అధ్యక్షుడిగా ఎం.డి జహీర్ అహ్మద్, ఉపాధ్యక్షుడిగా ముషీర్, ప్రధాన కార్యదర్శిగా ఆసిఫ్ అలీ, కోశాధికారిగా మునీరుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా  నసురుల్లా ఖాన్, సాబీర్ హుస్సేన్, ఇద్రీస్, సాజిద్ ఖాన్,  అన్సర్, జియా ఉద్దీన్, ఎతేషా మొద్దీన్ ను నియమించారు.