IPL 2025: జహీర్ ఖాన్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌ జట్టుకు మెంటార్‌గా ఛాన్స్

IPL 2025: జహీర్ ఖాన్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌ జట్టుకు మెంటార్‌గా ఛాన్స్

ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ కరువయ్యారు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ 2022, 2023 సీజన్లలో లక్నో జట్టును విడిచిపెట్టి కోల్ కతాకు వెళ్లడంతో 2024 సీజన్ లో మెంటార్ లేకుండానే ఆడింది. గంభీర్ తో పాటు ప్రస్తుతం లక్నో జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ సైతం ఆ జట్టుకు దూరమయ్యాడు. ఈ మాజీ సఫారీ పేసర్ ప్రస్తుతం భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో ఒకేసారి ఆ జట్టుకు మెంటార్.. బౌలింగ్ కోచ్ లేకుండా పోయారు. 

తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ రోల్ కోసం టీమిండియా మాజీ పేసర్..ముంబై ఇండియన్స్ క్రికెట్ డెవలప్‌మెంట్ గ్లోబల్ హెడ్ జహీర్ ఖాన్‌ను సంప్రదించినట్టు సమాచారం. నివేదిక ప్రకారం.. సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2025 లో లక్నో కోసం మెంటార్ పాత్రను చేపట్టేందుకు జహీర్ ఖాన్‌తో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని క్రిక్ బజ్ ధృవీకరించడంతో జహీర్ ఖాన్ లక్నో మెంటార్ గా వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. 

జహీర్ లక్నో జట్టుతో చేరితే అతను ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ తో పాటు ఆడమ్ వోజెస్, లాన్స్ క్లూసెనర్, జాంటీ రోడ్స్ లతో కలిసి పని చేస్తాడు. 45 ఏళ్ల జహీర్ ఖాన్ భారత్ తరఫున 92 టెస్టులు.. 200 వన్డేలు.. 17 టీ20లు ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 100 మ్యాచ్‌లు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ జట్లకు ఆడాడు.