4 రోజుల పాటు జహీరాబాద్ – బీదర్ మధ్య రాకపోకలు బంద్

ఇవాళ్టి (డిసెంబర్ 29) నుంచి జనవరి 1వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు జహీరాబాద్ నుంచి బీదర్ మధ్య రాకపోకలు బంద్  కానున్నాయి.  రైల్వే గేటు మరమ్మతుల కారణంగా ఈ నాలుగు రోజుల పాటు జహీరాబాద్ టూ బీదర్ రోడ్డును తాత్కాలికంగా మూసివేయనున్నారు. దీంతో ఈ మార్గంపై రాకపోకలు సాగించే వాహనదారులు అల్గోల్ రోడ్డు, అల్లాన ఫ్యాక్టరీ, దిడ్డి రూట్ల మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. జనవరి 2  నుంచి యధావిధిగా వాహనదారులు ఈ రోడ్డు గుండా ప్రయాణించవచ్చని తెలిపారు.