
నారాయణ్ ఖేడ్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షేట్కార్ బుధవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ మంత్రికి, ఎమ్మెల్యేలకు,నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ వెంట హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ,జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ ఇన్చార్జి చంద్రశేఖర్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేశ్ షేట్కార్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ ఉన్నారు.