ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి : గోపాల్ జి. తివారీ

ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి : గోపాల్ జి. తివారీ

కామారెడ్డి ​, వెలుగు: ఓటింగ్​ శాతం పెంపునకు ఆఫీసర్లు కృషి చేయాలని  జహీరాబాద్​ పార్లమెంట్ పరిధి జనరల్ అబ్జర్వర్ గోపాల్ జి తివారీ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో పోలింగ్​ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.  అక్కడున్న  స్టాప్​తో మాట్లాడారు.  ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో సజావుగా జరిగేలా చూడాలన్నారు.  జిల్లాలో 6 లక్షల 80 వేల మంది ఓటర్లు ఉన్నారని  913 పోలింగ్​సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.  కలెక్టర్​జితేష్​ వి పాటిల్, ఆర్డీవో రఘునాథ్​రావు, నోడల్​ఆఫీసర్​రఘునాథ్,​ ఆఫీసర్లు పాల్గొన్నారు.

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేటలోని జడ్పీ హై స్కూల్‌ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ గోపాల్ తివారీ ఆదివారం పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్​పార్లమెంట్​ పరిధిలో 18 –-19 ఏళ్ల వయస్సు కల్గిన 53,678 మంది నూతన ఓటర్లు ఓటుహక్కు పొందారని వీరందరికి ఈనెల13న జరిగే పార్లమెంట్​ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.

ఎల్లారెడ్డి జీవదాన్​ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​ రూమ్​ను అందులో భద్రపర్చిన ఈవీఎంలను ఆయన పరిశీలించారు. ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్, నోడల్ అధికారి రఘునాథ్, లింగంపేట డిప్యూటీ తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి