జహీరాబాద్, వెలుగు: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐడీసీ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ తెలిపారు. సోమవారం జహీరాబాద్ లోని మాజీ మంత్రి దివంగత ఫరీదుద్దీన్ స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
ఈనెల 23న జహీరాబాద్ లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహమ్మద్ ఫరీదుద్దీన్ జ్ఞాపకార్థం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 120 చిన్న, పెద్ద ఫ్యాక్టరీల అధికారులు జాబ్ మేళాలో పాల్గొని యువతను ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తారన్నారు. ఈ ప్రెస్ మీట్ లో దక్కన్ బ్లాస్ట్ చైర్మన్ మన్నాన్ ఖాన్, కుతుబుద్దీన్, బాసిత్, జహంగీర్, రాములు నేత, మోతీరాం పాల్గొన్నారు.