నాగార్జున చిన్న కోడలు.. అఖిల్ భార్య జైనాబ్ విశేషాలు ఇవే.. ఆమె కుటుంబ చరిత్ర ఇదీ..!

నాగార్జున చిన్న కోడలు.. అఖిల్ భార్య జైనాబ్ విశేషాలు ఇవే.. ఆమె కుటుంబ చరిత్ర ఇదీ..!

అఖిల్ నిశ్చితార్థం జరిగిందని ప్రకటించి నాగార్జున కుటుంబం టాలీవుడ్తో పాటు మీడియా వర్గాలను, అక్కినేని అభిమానులను కూడా విస్మయానికి గురిచేసింది. అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో ఈ ప్రేమ జంట వైవాహిక బంధం వైపు అడుగులేసింది. జైనాబ్ రవ్జీ అనే పేరు చూడగానే నెటిజన్లకు ఆమె ఎవరో, ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. Zainab Ravdjee పేరును గూగుల్ సెర్చ్ చేసి మరీ వెతికారు. ఆమె తన ఇన్స్టాగ్రాం అకౌంట్ను కూడా ప్రైవేట్లో ఉంచడంతో ఆమె గురించి పెద్దగా వివరాలు తెలియలేదు. 

అయితే.. ఆమె ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ అని తెలిసింది. నాగార్జునకు, జైనాబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రవ్జీ ఫ్రెండ్ కావడంతో ఈ ప్రేమ జంటకు మార్గం సుగమమైంది. ఆమె తండ్రి వ్యాపారవేత్త కావడంతో దుబాయ్, లండన్, ఇండియా.. ఇలా మన దేశంలో పాటు పలు దేశాల్లో ఆమె తన జీవితాన్ని గడిపింది. జైనాబ్ రవ్జీ ఫ్యామిలీకి బంజారాహిల్స్ రోడ్ నంబర్.7లో సొంత ఇల్లు కూడా ఉంది. జైనాబ్ రవ్జీ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిట్ట అని తెలిసింది.

ALSO READ | బిల్లా మూవీలో బికినీ వేసుకుంటే.. నల్లగా ఉన్నావని కామెంట్ చేశారు : నయనతార

జైనాబ్ రవ్జీ కూడా థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా చిత్రలేఖనంలో కూడా అదరగొట్టే ప్రతిభ ఉందట. ఆమె Abstract Paintings లండన్, దుబాయ్, ఇండియా.. ఇలా పలు దేశాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్స్లో ఆకట్టుకున్నాయట. క్రియేటివిటీ, కల్చర్ ప్రతిబింబించేలా ఆమె పెయింటింగ్స్ ఉన్నాయనేది చిత్రలేఖనంపై మక్కువ ఉన్న కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయం. 

అఖిల్, జైనాబ్ రవ్జీ నిశ్చితార్థం 2024 నవంబర్లో జరిగినప్పటికీ పెళ్లి మాత్రం 2025లో జరగనుంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. అఖిల్కు, ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ నిశ్చితార్థం జరిగినప్పటికీ పెళ్లి రద్దైంది. ఆ తర్వాత శ్రేయా భూపాల్ మరొకరిని వివాహం చేసుకుంది. పెళ్లి రద్దు చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత అఖిల్ పెళ్లి పీటలెక్కనుండటంతో అక్కినేని కుటుంబంలో కోలాహలం కనిపించింది.