NZ vs ENG: ఇంగ్లాండ్ బ్యాటర్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్

NZ vs ENG: ఇంగ్లాండ్ బ్యాటర్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్

సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. డ్రా చేసుకోకుండా అన్ని మ్యాచ్ లు గెలిస్తే దానిని క్లీన్ స్వీప్ అంటారు. క్రికెట్ లో సాధారణంగా ఒక జట్టు మరో జట్టును క్లీన్ స్వీప్ చేయడం చూశాం. అయితే సిరీస్ లో ఒక బ్యాటర్ ను ప్రత్యర్థి బౌలర్ క్లీన్ స్వీప్ కూడా చేస్తారు. క్రికెట్ లో అరుదుగా జరిగే ఈ సంఘటన తాజాగా మరోసారి జరిగింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీని న్యూజిలాండ్  ఫాస్ట్ బౌలర్ హెన్రీ ఒకే సిరీస్ లో ఏకంగా 6 సార్లు ఔట్ చేశాడు. 

ఇటీవలే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో సిరీస్ గెలిచింది. తొలి రెండు టెస్టులు ఇంగ్లాండ్ గెలిస్తే.. చివరి టెస్ట్ కివీస్ గెలిచింది. ఈ సిరీస్ లో క్రాలీకి హెన్రీ పీడకలనే మిగిలిచ్చాడు. ఆరు ఇన్నింగ్స్ ల్లో ఆరు సార్లు ఔట్ చేసిఅరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హెన్రీ దెబ్బకు క్రాలీ సిరీస్ మొత్తం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు.

ALSO READ | Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్‌లోనే మ్యాచ్‌లు: పాకిస్థాన్, భారత్‌కు ఐసీసీ సమన్యాయం

మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఒక బ్యాటర్ ను బౌలర్ ఆరు సార్లు ఔట్ చేయడం ఇది కేవలం మూడో సారి మాత్రమే. 1985 లో న్యూజి లాండ్ ఆల్ రౌండర్ రిచర్డ్ హ్యడ్లి 3 మ్యాచ్ ల టెస్టుల సిరీస్‌లో మాథ్యూస్ ను ఆరు సార్లు ఔట్ చేయగా.. 2006 లో సౌతాఫ్రికా బౌలర్  మకాయ ఎంతిని.. ఆస్ట్రేలియా ఓపెనర్ హైడెన్ ను మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఆరుసార్లు ఔట్ చేశాడు.