టీమిండియాకు స్టార్ పేసర్ బుమ్రా లేకపోవడంతో సిరాజ్ భారత పేస్ బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్నాడు. అనుభవం లేని ఆకాష్ దీప్ అదరగొడుతుంటే సిరాజ్ నాలుగో టెస్టులో ప్రభావం చూపించలేకపోతున్నారు. ఈ హైదరాబాదీ పేసర్ వేసిన ఏడో ఓవర్లో క్రాలి తన విశ్వ రూపాన్ని చూపించాడు. తొలి రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే వచ్చింది. అయితే ఆ తర్వాత నాలుగు బంతుల్లో క్రాలి వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దీంతో ఒక్క ఓవర్లోనే ఏకంగా 19 పరుగులు వచ్చాయి. తొలి మూడు ఓవర్లు బాగానే వేసిన సిరాజ్ తన నాలుగో ఓవర్ లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. సిరాజ్ విఫలమైనా మరో పేసర్ ఆకాష్ దీప్ తొలి టెస్టు మ్యాచ్ లోనే సత్తా చాటాడు. 9 వ ఓవర్ రెండో బంతికి డకెట్ వికెట్ తీసి భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఇదే ఓవర్ లో నాలుగో బంతికి పోప్ ను ఎల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజ్ లో క్రాలి (35) రూట్ (0) ఉన్నారు.
Zak Crawley against Mohammad Siraj:
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2024
4,4,4,6. pic.twitter.com/kGB1n6L5M3