IND vs BAN 2024: బంగ్లా ఓపెనర్ జిడ్డు బ్యాటింగ్.. 24 బంతులాడి డకౌటయ్యాడు

కాన్పూర్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తుంది. వర్షం పడడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన బంగ్లా ఓపెనర్లు తొలి గంట సేపు ఆచితూచి ఆడారు. దీంతో ఓ వైపు వికెట్ రాలేదు. మరో వైపు పరుగుల వేగం మందగించింది. అయితే ఓపెనర్లు ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో బంగ్లాదేశ్ 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. 

ఈ మ్యాచ్ లో బంగ్లా ఓపెనర్ జాకీర్ హసన్ తన జిడ్డు బ్యాటింగ్ తో విసిగించాడు. బుమ్రా, సిరాజ్,ఆకాష్ దీప్ పదునైన బంతులకు అతని వద్ద సమాధానం లేకుండా పోయింది. 24 బంతులాడి ఒక్క పరుగు చేయకుండా పెవిలియన్ కు చేరాడు. ఆకాష్ డీప్ బౌలింగ్ లో జైశ్వాల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ఇస్లాంను ఆకాష్ దీప్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు. రెండు వికెట్లు ఆకాష్ దీప్ కే దక్కాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. కెప్టెన్ శాంటో (8), మోమినుల్ హక్ (0) క్రీజ్ లో ఉన్నారు.    

Also Read : 20 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై