డ్రీమ్ హౌస్ కోసం విడాకులు!
టైటిల్ : జర హట్కే జర బచ్కే
కాస్ట్ : విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్, ఇనాముల్ హక్, రాకేశ్
లాంగ్వేజ్ : హిందీ
డైరెక్షన్ : లక్ష్మణ్ ఉటేకర్
ప్లాట్ ఫాం : జియో సినిమా
కపిల్ ( విక్కీ కౌశల్), సౌమ్య చావ్లా (సారా అలీఖాన్) దంపతులు. ఊళ్లో ఒక చిన్న ఇంట్లో హాయిగా ఉంటుంటారు. కపిల్ యోగా ఇన్స్ట్రక్టర్. మిడిల్ క్లాస్ ఆలోచనలతో ఉంటాడు. సౌమ్య మోడర్న్ పంజాబీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో తనకు నచ్చినట్టు ఉంటుంది. వాళ్లిద్దరూ సంతోషంగానే ఉన్నా సౌమ్య మాత్రం ఆ ఇంట్లో ప్రైవసీ లేదని ఫీలవుతుంది. త్వరలోనే డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని కలలు కంటుంది. ఈఎమ్ఐలు కట్టే పరిస్థితులు వాళ్లకు లేకపోయినా తన నిర్ణయం మాత్రం మారదు.
సరిగ్గా అదేటైంలో విడాకులయిన వాళ్లకు లాటరీ ఛాన్స్ అనే ఒక స్కీమ్‌లో చేరతారు. అప్పటి నుంచి వాళ్లు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నట్టు అందర్నీ నమ్మించేలా గొడవపడుతుంటారు. వేరుగా ఉంటుంటారు. మరి ఇంతకీ వాళ్ల కల నిజమైందా? వాళ్లు ఇద్దరూ ఆడే నాటకం ఏ పరిస్థితులకి దారి తీస్తుంది? సంతోషంగా ఉన్న దంపతుల కథ చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇందులో నటీనటుల యాక్టింగ్ బాగుంది. ఫక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్.