ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించిన డిజిటల్ యువతుల కోసం ప్రపంచంలోనే తొలిసారి ఫ్యాన్ వ్యూ అనే సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ అందాల పోటీలో పలు దేశాల నుంచి 1500 మంది ఏఐ మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడ్డారు. వీరి నుంచి టాప్ 10 ఫైనలిస్టులను ఎంపిక చేయగా భారత్‌కు చెందిన జారా శతావరి ఎంపికైంది.
మిస్ వరల్డ్ పోటీల్లానే ఇందులో గెలిచిన వారికి మిస్ ఏఐ టైటిల్ లభిస్తుంది. భారతదేశం నుంచి మొదటిసారిగా ప్రాతినిధ్యం వహించింది ఏఐ మోడల్ శతావరినే. ఆసియా ఖండం నుంచి ఫైనల్ లిస్ట్‌లో ఉన్న ఇద్దరిలో ఈమె ఒకరుగా నిలిచారు.