పాక్ ప్రెసిడెంట్ గా మరోసారి జర్దారీ

ఇస్లామాబాద్: పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ(68 ) ఎన్నికయ్యారు. దీంతో  పాక్ కు రెండుసార్లు ప్రెసిడెంట్ అయిన తొలి వ్యక్తిగా జర్దారీ రికార్డ్ సృష్టించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) కో-చైర్‌‌పర్సన్ అయిన జర్దారీ.. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్ఎన్) మద్దతుతో  ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ అభ్యర్థి మహ్మద్ ఖాన్ అచక్జాయ్(75) పోటీ పడ్డారు. శనివారం ఎన్నికలు జరగగా.. జర్దారీకి 255 ఓట్లు వచ్చాయి. అచక్జాయ్119 ఓట్లను పొందారు. పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.