ఇస్లామాబాద్: పాకిస్తాన్ 14వ ప్రెసిడెంట్‌గా ఆసిఫ్ అలీ జర్దారీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోని ఐవాన్–ఎ–సదర్ లో జర్దారీతో పాక్ చీఫ్ జస్టిస్ ఖాజీ ఫేజ్ ఇసా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధికారులు హాజరయ్యారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) కో చైర్మన్ అయిన జర్దారీ పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ పార్టీ మద్దతుతో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు.
ప్రత్యర్థిగా సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (ఎస్ఐసీ) అభ్యర్థి మహ్మద్ ఖాన్ అచక్జాయ్ పోటీ పడ్డారు. శనివారం ఎన్నికలు జరగగా జర్దారీ భారీ తేడాతో విజయం సాధించారు. పాక్‌కు రెండు సార్లు ప్రెసిడెంట్ అయిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.