పీఎంపీలు, ఆర్​ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి : జెడ్పీ సీఈవో చందర్​నాయక్​​

పీఎంపీలు, ఆర్​ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి : జెడ్పీ సీఈవో చందర్​నాయక్​​

సదాశివనగర్, వెలుగు:రోగులకు  పీఎంపీలు, ఆర్​ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని జడ్పీ సీఈవో చందర్​ నాయక్​ అన్నారు. శుక్రవారం సదాశివనగర్​ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పీఎంపీ, ఆర్​ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన​మాట్లాడుతూ.. గ్రామాలలో పీఎంపీలు, ఆర్ఎంపీలు రోగులకు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్నారు.  

రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే క్రిమినల్​చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్​ఆస్మా, ఎంపీడీవో సంతోశ్​ కుమార్​, ఎంపీవో సురేందర్ రెడ్డి, సీహెచ్​వో నాగరాజు, పీఎంపీలు విజయ్​ కుమార్​, సురేవ్​ గుప్తా, సత్యానారయణ,  వడ్ల ఆంజనేయులు, శివారెడ్డి, ఎర్రవాటి లింగారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు 
పాల్గొన్నారు.