ఆసిఫాబాద్ జిల్లాలో 3,54,691 మంది ఓటర్లు

ఆసిఫాబాద్ జిల్లాలో 3,54,691 మంది ఓటర్లు

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను సోమవారం జడ్పీ సీఈవో లక్ష్మీ నారాయణ ప్రకటించారు. జిల్లాలో మొత్తం 3,54,691 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,77,105 మంది, మహిళలు 1,77,567 మంది ఉన్నట్లు చెప్పారు. 

19 మంది ఇతరులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. జిల్లాలో అత్యల్పంగా లింగాపూర్ లో 10,583 మంది, అత్యధికంగా కాగజ్ నగర్ మండలంలో 45,354 మంది ఉన్నారు.  మొత్తం 15 ఎంపీపీ,15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు వెల్లడించారు