ఓటీటీలోకి జీబ్రా మూవీ .. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

 ఓటీటీలోకి జీబ్రా మూవీ .. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

సత్యదేవ్, డాలీ ధనంజయ లీడ్ రోల్స్‌‌లో ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం ‘జీబ్రా’. ఎస్‌‌ఎన్ రెడ్డి,  బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు.  నవంబర్  మూడో వారంలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌‌కు రెడీ అయింది. 

డిసెంబర్ 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రెస్‌‌మీట్ నిర్వహించారు.  థియేటర్స్‌‌లో విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ ద్వారా మరింత ఆదరణను అందుకోనుందని హీరో సత్యదేవ్ చెప్పారు.  నటి ఉషశ్రీ,  నిర్మాత ఎస్‌‌ఎన్ రెడ్డి,  ఆహా కంటెంట్ వైస్‌‌ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కుమార్, మార్కెటింగ్ ఆఫీసర్ విపిన్ ఉన్ని పాల్గొన్నారు.