హైదరాబాద్, వెలుగు: జీలియో ఈ–బైక్స్ గ్రేసీ సిరీస్‌లో లోస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 59,273 నుంచి రూ. 83,073 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. వీటికితోడు బీఎల్డీసీ మోటార్‌తో కూడిన గ్రేసీ ఐ బైక్‌ను కూడా లాంచ్ చేసింది. దీని బరువు 60 కిలోలు కాగా, 150 కిలోల లోడింగ్ సామర్థ్యం ఉంటుంది. మెరుగైన భద్రత కోసం స్కూటర్లో ముందు డిస్క్ బ్రేక్‌లు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
ఇది ఐదు వేర్వేరు మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. గ్రేసీ ప్రో మోడల్బరువు 70 కిలోలు కాగా, లోడింగ్ సామర్థ్యం 150 కేజీలు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. జీలియో బైక్స్‌లో యాంటీ-థెఫ్ట్ అలారం, రివర్స్ గేర్ ఫీచర్, ఆటో రిపేర్ స్విచ్, డిజిటల్ డిస్ప్లే, ఎక్కువ బూట్ స్పేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.