జీస్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.2,500 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జీస్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.2,500 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • జీస్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.2,500 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కర్నాటకలో ప్లాంట్ ఏర్పాటు

న్యూఢిల్లీ : ఆప్టికల్ లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తయారు చేసే  జీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ఇండియాలో రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది. కర్నాటకలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కళ్లద్దాల్లో వాడే లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేస్తామని కంపెనీ పేర్కొంది.  జీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్  సబ్సిడరీ  కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా  తాజా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 5 వేల మందికి జాబ్స్ ఇస్తుందని అంచనా. 

ALSO READ :రైతులే దేశానికి బలం...: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

25 ఏళ్ల కిందటే ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించిన జీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5 వేల కోట్ల రెవెన్యూ సాధించాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. బెంగళూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో 34 ఎకరాల ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేకరించామని, దగ్గరలోనే మరో 9 ఎకరాలు సేకరించే ఆలోచనలో ఉన్నామని కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీస్ ఇండియా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ అన్నారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు.