దిగొచ్చిన జెలెన్ స్కీ : అమెరికాతో ఒప్పందానికి రెడీ అంటూ ప్రకటన

దిగొచ్చిన జెలెన్ స్కీ : అమెరికాతో ఒప్పందానికి రెడీ అంటూ ప్రకటన

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చల్లబడ్డాడు. ట్రంప్ పెట్టిన మెలికను, శరతులను అంగీకరిస్తున్నట్లు ప్రకటన చేశాడు. శుక్రవారం (ఫిబ్రవరి28) శాంతి చర్చల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వాగ్వాదానికి దిగి అర్థంతరంగా వెళ్లిపోయిన జెలెన్ స్కీ.. 24 గంటలు గడవక ముందే చల్లబడ్డాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తగ్గడమే మేలు అని భావించాడేమో.. కానీ వరుస ట్వీట్లతో ప్రకటనలు చేశాడు. 

శనివారం (మార్చి1) తమకు మద్ధతు ఇస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు,  ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ‘‘ఈ మూడేళ్లుగా మాపై జరుగుతున్న దాడికి మద్ధతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాం’’అని ఎక్స్ ద్వారా తెలిపాడు. 

ALSO READ : రెచ్చిపోతున్న రష్యా : ఉక్రెయిన్ పై మరోసారి దండయాత్ర : 2 గ్రామాలు స్వాధీనం

అమెరికా పెట్టిన షరతులను అంగీకరిస్తున్నామని, మినరల్ డీల్ కు తమ దేశం అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మినరల్ డీల్ కు మేము ఒప్పుకుంటున్నాం. మాకు సెక్యూరిటీ గ్యారంటీ అందించే విషయంలో అది మొదటి స్టెప్. అయితే ఇది సరిపోదు. మాకు అంతకంటే ఇంకా పెద్ద మద్ధతు కావాలి. సెక్యూరిటీ గ్యారంటీ లేకుండా యుద్ధ విరమణ ఒప్పందం చాలా ప్రమాదకరం. మేము మూడేళ్లుగా యుద్ధం చేస్తున్నాం. మా ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా మా సైడ్ ఉందనే హామీ రావాలని కోరుతున్నారని’’ అని అన్నారు. 

శుక్రవారం జరిగిన ట్రంప్, జెలెన్స్ స్కీ చర్చల్లో భాగంగా ఉక్రెయిన్ కు సాయం చేయాలంటే, యుద్ధం ఆపాలంటే ఉక్రెయిన్ ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అవకాశం ఇవ్వాలని ట్రంప్ షరతులు పెట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా ‘మేం మీకు 350 బిలియన్ డాలర్లు ఇచ్చాం. సైనిక సామగ్రి, ఆయుధాలు సమకూర్చాం. అందుకే ఇన్నాళ్లు పోరాడారు. మేం కనుక ఈ సాయం చేయకుంటే, అమెరికా ఆయుధాలు లేకుంటే యుద్ధం కేవలం రెండు వారాల్లో ముగిసిపోయి ఉండేది’ అంటూ జెలెన్ స్కీతో ట్రంప్​అన్నారు. దీనికి అంతే వేగంగా స్పందిస్తూ.. అవునవును, యుద్దం రెండు రోజులు కూడా జరిగేది కాదు. 

అయితే ముందుగా యుఎస్ షరతులను అంగీకరించని జెలెన్ స్కీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని షరతులకు అంగీరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం