పుతిన్ త్వరలోనే చనిపోతడు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం క్లోజ్: జెలెన్ స్కీ

పుతిన్ త్వరలోనే చనిపోతడు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం క్లోజ్: జెలెన్ స్కీ

కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్  త్వరలోనే చనిపోతారని, దాంతో రష్యా, ఉక్రెయిన్  మధ్య యుద్ధం కూడా ముగిసిపోతుందని ఉక్రెయిన్  ప్రెసిడెంట్  వోలోదిమిర్  జెలెన్ స్కీ అన్నారు. బుధవారం పారిస్ లో ఇచ్చిన ఓ  ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ మాట్లాడారు. పుతిన్  ఇప్పటికే ఒంటరి వారయ్యారని, ఆయనకు అమెరికా సహాయం చేయకపోవడం చాలా కీలకమని పేర్కొన్నారు.
 

‘‘మరణించేంత వరకూ అధికారంలోనే ఉండాలని పుతిన్  అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. పుతిన్  తీరుతో ఉక్రెయిన్ కే కాదు వెస్ట్  మొత్తానికీ ప్రమాదం. అమెరికా, యూరోపియన్  కూటమిని చూసి ఆయన భయపడుతున్నారు. అందుకే ఆ అలయెన్స్ ను విడగొట్టాలని చూస్తున్నారు.  తాను చనిపోతానని కూడా పుతిన్  భయపడుతున్నారు. నిజంగా త్వరలోనే ఆయన చనిపోతారు. అప్పుడు రష్యా, ఉక్రెయిన్  యుద్ధం  కూడా ముగుస్తుంది” అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.