100 మిస్సైల్స్, 100 డ్రోన్లతో ఉక్రెయిన్ పై రష్యా దాడి : జెలెన్‌స్కీ

100 మిస్సైల్స్, 100 డ్రోన్లతో ఉక్రెయిన్ పై  రష్యా దాడి : జెలెన్‌స్కీ

రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర బాంబుల దాడులు మొదలయ్యాయి. ఆగస్టు 26న  100 క్షిపణులు,100 డ్రోన్లతో తమపై  రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్‌స్కీ ఓ వీడియో రిలీజ్ చేశారు.  ఇప్పటివరకు ఇదే అతిపెద్ద దాడి అని చెప్పారు. రష్యా దెబ్బకు మౌళిక సదుపాయలు దెబ్బతిన్నాయని..విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. కొన్ని చోట్ల పునరుద్ధరణ చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు జెలెన్ స్కీ.

ALSO READ | డ్రోన్ బాంబుతో.. హైరైజ్ టవర్స్ పై దాడులు : రష్యాపై ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడి

  యూరోపియన్ దేశాలకు సమీపంలో ఉన్న  పశ్చిమ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు చెప్పారు జెలెన్ స్కీ. దాడి వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని  రష్యాను దెబ్బ కొట్టేందుకు  సాయం చేయాలని యూరోపియన్ దేశాలను జెలెన్‌స్కీ కోరారు.   రష్యా క్షిపణులను, డ్రోన్ లను కూల్చేందుకు తమ వైమానిక దళంతో  యూరోపియన్ దేశ రక్షణ దళం కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వార తమ దేశ పౌరులను కాపాడుకునేందకు ఎక్కువ ప్రయత్నించగలమన్నారు.