న్యూఢిల్లీ: ఇంకో 18-–24 నెలల్లో రిటైల్ సేల్స్‌లో డీమార్ట్‌ను అధిగమిస్తామని జెప్టో సీఈఓ అదిత్ పలిచా పేర్కొన్నారు. ‘డీమార్ట్ 30 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ. మా సేల్స్‌తో పోలిస్తే వారిది కేవలం 4.5 రెట్లే ఎక్కువ. అన్ని అనుకున్నట్టు జరిగితే ఏడాదికి రెండు నుంచి మూడు రెట్లు మా బిజినెస్ విస్తరిస్తుంది.
సుమారు 18–-24 నెలల్లో డీమార్ట్‌ను అధిగమించే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు. గ్రోసరీ సేల్స్‌లో కీలకంగా ఉన్న టాప్ 40 సిటీల్లోని 5 కోట్ల నుంచి 7.5 కోట్ల కుటుంబాలపై ఫోకస్ పెడతామని పేర్కొన్నారు. దేశంలో గ్రోసరీ మార్కెట్ ప్రస్తుత 400 బిలియన్ డాలర్ల నుంచి 2028–29 నాటికి 850 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు.